జనగాం: జనగామ: మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు 48 గంటల నిరాహార దీక్ష విరమణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు చేపట్టిన దీక్షను డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.