వాల్మీకిపురం మండలంలో పల్లె పరిశుభ్రతకు చెత్త బండ్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో మనోహర్ రాజు తెలిపారు బుధవారం వాల్మీకిపురం మండలానికి ప్రభుత్వం నుంచి నాలుగు పారిశుద్ధ్య చెత్త బండ్లు వచ్చాయన్నారు. వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ కోసూరి చంద్రమౌళి ముఖ్య అతిథులుగా హాజరై వాల్మీకిపురం పంచాయతీకి 2, చింతపర్తి పంచాయతీకి 1, గండబోయినపల్లి పంచాయతీకి 1 పంపిణీ చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లె పరిశుభ్రత మనందరి బాధ్యత అనే కార్యక్రమం ద్వారా గ్రామంలోని ఇరుకు రోడ్లలో ఈ చెత్త బండ్లు ద్వారా చెత్త సేకరణ చేస్తారని అన్నారు