లింగాల ఘనపూర్: జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు: ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష
జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 24 నుంచి 29 వరకు జరగనున్న ఉత్సవాలకు 40 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, పారిశుద్ధ్యం మరియు ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.