కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో ఖాళీ సీట్ల భర్తీ కోసం రిలే నిరాహార దీక్ష
శాతవాహన యూనివర్సిటీలో లా మరియు వివిధ పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని శాతవాహన జేఏసీ ఆధ్వర్యంలో పది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడంలో యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.