గూడూర్: గూడూరులో ఘనంగా 2K రన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం జిల్లా ఎస్పీ పిలుపు
మహబూబాబాద్ జిల్లా గూడూరులో 1,000 మంది విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన 2K రన్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ సమాచారం తెలిపేవారికి 5,000 బహుమతి ఇస్తామని, హెల్ప్‌లైన్ నంబర్ 87126 56999ను సంప్రదించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.