ఏటూరునాగారం: కమలాపురం ఆదర్శ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఆదర్శ హైస్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. నెహ్రూ జయంతి సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.