నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రారంభించారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.