పార్వతీపురం: జంఝావతి ప్రాజెక్టు సాధన దీక్షకు భారీ మద్దతు: సంఘీభావం తెలిపిన పంచిరెడ్డి కృష్ణారావు
జంఝావతి ప్రాజెక్టు సాధన దీక్షకు శ్రీకాకుళం జిల్లా నుండి మద్దతు లభించింది. ప్రాజెక్టు వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పంచిరెడ్డి కృష్ణారావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం అందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సాధన సమితి కోరుతోంది.