సిద్దిపేట అర్బన్: డిప్యూటీ విద్యాశాఖాధికారి పరీక్షల ఏర్పాట్లు పూర్తి: పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు
తెలంగాణలో డిప్యూటీ విద్యాశాఖాధికారి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పరీక్షలు ఈ నెల 12, 13 తేదీల్లో జరుగుతాయి. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని, జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి ఉంచాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.