నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఆత్మకూరు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు సోమవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్ల చేత ప్లకార్డులు చేత పట్టించి మద్యం తాగి వాహనాలు నడపం, ఓవర్ లోడ్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపం అంటూ నినాదాలు చేయించారు. అనంతరం వాటి వలన జరిగే అనర్ధాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన కోరారు.