నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద కొనసాగుతుంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 11,384 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 72.995 TMCల నీటిమట్టం నమోదైంది. పెన్నా డెల్టాకు 10,150 క్యూసెక్కులు, కండలేరుకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 281 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.