వరంగల్: వరంగల్లో ఘనంగా వినాయక విగ్రహ ఊరేగింపు: ప్రత్యేక ఆకర్షణగా పుణే కళాకారుల నృత్యాలు
వరంగల్ నగరంలో బుధవారం రాత్రి వినాయక విగ్రహ ఊరేగింపు కన్నులపండువగా సాగింది. పోచమ్మమైదాన్ నుంచి వెంకట్రామ వరకు జరిగిన ఈ ఊరేగింపులో పుణే కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.