ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామానికి చెందిన 40 ఏళ్ల కురువ సులోచన బుధవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆమె భర్త సుంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆమె ఆటో ఎక్కి కోడుమూరు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.