మహబూబాబాద్: ప్రజావాణిలో 103 అర్జీలు: సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశం
జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 103 దరఖాస్తులు అందాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. అర్జీలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాలు జారీ చేశారు.