చేర్యాల: సిద్దిపేటలో కలకలం: బతికి ఉన్నవారికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఈ-సైన్ దుర్వినియోగం చేసి 22 నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు భుక్య మధు, షేవల్ల రమేష్ లపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.