చోడవరం: చోడవరం శారదా నదిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యం
చోడవరం మండలం గోవాడ గ్రామంలో శారదా నదిని దాటుతుండగా ఊబిలో చిక్కుకొని గల్లంతైన శానాపతి అప్పారావు (53), ఏడువాక నూకరాజు (45) మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రానికి మృతదేహాలను వెలికితీశారు.