ఉరవకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు పంపిణీపై విద్యార్థి సంఘాలు ఆందోళన
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు పంపిణీపై విద్యార్థి సంఘాలు ఆదివారం ఆందోళనకు దిగారు. కాలం చెల్లిన మాత్రలు ఇవ్వడంపై ఆసుపత్రిలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాలం చెల్లిన మందులు ఇవ్వడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం అడటమే అన్నారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వైద్యాధికారి వినతిపత్రం అందజేసారు.