హనుమకొండ: ముదిరాజుల కోసం జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ భవనాలు నిర్మించాలి: మెపా డిమాండ్
హన్మకొండలో జరిగిన మెపా సమావేశంలో ముదిరాజుల సంక్షేమంపై చర్చించారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ భవనాల నిర్మాణం చేపట్టాలని, కోకాపేటలో ఆత్మగౌరవ భవనానికి నిధులు విడుదల చేయాలని మెపా రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.