విశాఖపట్నం: మాధవధార జీవీఎంసీ స్కూల్లో భోజన నాణ్యతను పరిశీలించిన కలెక్టర్
విశాఖపట్నం మాధవధార జీవీఎంసీ హైస్కూల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని, వాష్ బేసిన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.