శాలిగౌరారం: నల్గొండ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: కారును ఢీకొట్టిన ఇసుక టిప్పర్
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవరం కలాన్ వద్ద జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్ అక్కడికక్కడే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.