ఒంగోలు అర్బన్: ఈనెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు జలాలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారు: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఈనెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు నుంచి జలాలు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించుకొని ఆయన చేతుల మీదుగానే ప్రాజెక్టు పూర్తి కావడం అందరికీ ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే నిర్వాసితులకు 700 కోట్ల రూపాయలకు పైగా వారి ఖాతాలలోకి జమ చేయడం జరిగిందని మూడు జిల్లాల ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు అని మంత్రి అన్నారు.