జనగాం: జనగామలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వసతులు కల్పించాలి: సీపీఎం డిమాండ్
జనగామలో 2012-13లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పొందిన వారికి సౌకర్యాలు కల్పించాలని సీపీఎం డిమాండ్ చేసింది. గతంలో కేటాయించిన 72 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆ లబ్ధిదారులకే ఇవ్వాలని, లేనిచో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ హెచ్చరించారు.