జిన్నారం: ఉస్మానియా యూనివర్సిటీలో 5 గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటో డ్రైవర్ కుమార్తె నిఖిత
ఐడీఏ బొల్లారానికి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె నిఖిత, ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో 5 గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి గారు ఆమెను సత్కరించి, ఉన్నత విద్యకు సహకరిస్తామని తెలిపారు.