గుంతకల్లు: గుత్తిలో గ్యాస్ కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు, గుత్తి సీఐ రామారావు హెచ్చరిక
గుత్తి పట్టణం, గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు హెచ్చరించారు. సోమవారం రాత్రి సీఐ రామారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఐ మాట్లాడుతూ గుత్తిలో ఉన్న అన్ని ఏజెన్సీల ద్వారా గత వారం రోజులలో సుమారు 19వేల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారని అన్నారు. గుత్తి మండలం తొండపాడులో భర్త సంసారాన్ని పట్టించుకోవడం లేదని బాధతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అయితే కొందరు దానిని పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం చేశారని అన్నారు.