విశాఖపట్నం: సింహాచలంలో ఘనంగా ముగిసిన దుర్గాదేవి మహోత్సవాలు: అంగరంగ వైభవంగా నిమజ్జనం
సింహాచలంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 14 రోజుల పాటు జరిగిన దుర్గాదేవి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నసమారాధన మరియు అమ్మవారి నిమజ్జనోత్సవంతో సింహాచలంలో పండుగ వాతావరణం నెలకొంది.