డోన్: నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల దాడులు, 10 లీటర్ల నాటసార స్వాధీనం
Dhone, Nandyal | Nov 12, 2026 సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాల్లో అక్రమ మద్యం, నాటుసారాయిపై డోన్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్యాపిలి మండలం సీతమ్మ తాండలో 650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తి వద్ద 10 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు. మత్తు పదార్థాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని CI జఫ్రుల్లా, Slలు సోమశేఖర్ దౌలత్ ఖాన్లు హెచ్చరించారు