ముమ్మిడివరం: ముమ్మిడివరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు - సిద్ధమైన మండపాలు
ముమ్మిడివరం మండలంలో సోమవారం వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. చింతలమెరక, హై స్కూల్ సెంటర్, బల్లగేట్, సుంకరవారివీధి, మార్కెట్ సెంటర్లలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు చేశారు. 9 రోజుల పాటు వినాయక నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు.