నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి, ఇంచార్జ్ సీఈఓ బాలకృష్ణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. సొసైటీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.