జిన్నారం: బొల్లారంలో రోడ్ల మరమ్మతు కోసం కోర్ కమిటీ డిమాండ్
బొల్లారం సిఎంసీ 272వ డివిజన్లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో రోడ్ల మరమ్మతులు, వీధిదీపాల సమస్య మరియు పెన్షన్ల ఇబ్బందులపై చర్చించారు. ఐటీసీ నుండి గాంధీ బొమ్మ, హనుమాన్ టెంపుల్ నుండి మైలాన్ కంపెనీ వరకు రోడ్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు.