బాపట్ల: సంతమాగులూరు గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
సంతమాగులూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో బాలల దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. స్థానిక అధికారులు మరియు సామాజిక కార్యకర్తల సమక్షంలో 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు.