బనగానపల్లె: నిమజ్జనంపై వస్తున్న అపోహలు నమ్మవద్దు : కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు
కొలిమిగుండ్లలో వినాయక నిమజ్జనంపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని సీఐ రమేశ్ బాబు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొలిమిగుండ్లలో 5వ రోజు నిమజ్జనమంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి వాటిని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఎవరూ నమ్మవద్దని కోరారు. కొలిమిగుండ్లతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో 3వ రోజునే విగ్రహాల నిమజ్జనం ఉంటుందని సీఐ స్పష్టం చేశారు.