శ్రీశైలం: గాజులపల్లి జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న డీఈఓ జనార్దన్ రెడ్డి
రాబోయే పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రస్తుత ఎస్ఏ-1 పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని డీఈఓ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మహానంది మండలం, గాజులపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న ఎస్ఏ-1 పరీక్షల తీరును, విద్యార్థుల హాజరును డీఈఓ స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.