కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి.. పరారీలో నిందితుడు
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి ర్యాకం శంకర్ మృతి చెందారు. వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు.