జగిత్యాల: వైద్య విద్యార్థుల కోసం దేహాన్ని దానం చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు
జగిత్యాల జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు తన మరణానంతరం దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించేందుకు అంగీకార పత్రం అందజేశారు. వైద్య విద్యార్థుల అభ్యాసం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సుభాష్ మరియు ఇతర వైద్యులు పాల్గొన్నారు.