సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పాండు, సంగీత పాల్గొని ఆజాద్ సేవలను కొనియాడారు. విద్య ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు దేశ ప్రగతిలో విద్య పాత్రను గుర్తు చేశారు.