అదిలాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక గత 30 ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు #localissue
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్య గత 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో పలు వార్డులు రైల్వే ట్రాక్ అటువైపు గానే ఉన్నాయి. దింతో ఆసుపత్రి లాంటి అత్యవసర సమయాల్లో రైల్వే ట్రాక్ దాటడానికి అటుగావైపు ఉన్న కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల నేతలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రజలను మభ్యపెడుతూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో పలు రైళ్ల రాకపోకలు పెరగడంతో తాంసి బస్టాండ్ తో పాటు ఆర్టీవో కార్యాలయం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద రాకపోకల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు