వరంగల్: వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ల విభజనపై హర్షం
వరంగల్ శివనగర్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, దళిత, గిరిజన అభివృద్ధికి తోడ్పడే ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.