గజపతినగరం: రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైన గంగచోళ్ల పెంట విద్యార్థినులు
కృష్ణాజిల్లా గన్నవరంలో జరగనున్న జూనియర్ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పూర్ణిమ, దీక్షిత, జయంతి ఎంపికయ్యారు. ఈ నెల 21 నుండి 23 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.