డోన్: రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ ఇంతియాజ్ భాష
Dhone, Nandyal | Sep 13, 2026 డోన్ పోలీస్టేషన్లో సస్పెక్ట్స్, రౌడీషీటర్లు, గతంలో కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి సీఐ ఇంతియాజ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేరాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవనం సాగించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.