రాజమండ్రి సిటీ: రాజమండ్రి ఎన్జీవో హోమ్ అభివృద్ధికి రూ.40 లక్షలు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి రూ.40 లక్షల నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. భవాని ట్రస్ట్, నియోజకవర్గ నిధులు మరియు ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.