గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సులోచన అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అప స్మారక స్థితిలో పడి ఉన్న సులోచనను కుటుంబ సభ్యులు గమనించి గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్య సేవలు అందించారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.