మహబూబాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు
నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణ, పరిహారం, పునరావాస పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ. 2,800 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.