ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం నాగుల పంచమి పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, మహిళలు పెద్ద సంఖ్యలో పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు, శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పలుచోట్ల వెలసిన పుట్టల వద్ద భక్తులు ప్రదక్షిణలు చేశారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డులను నైవేద్యంగా సమర్పించారు