గుంతకల్లు: గుత్తి మండలం వన్నేదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ బోల్తా, రూ.30వేలు నష్టం
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున లారీ అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు లోడుతో లారీ బయలుదేరింది. అయితే లారీ డ్రైవర్ నిద్ర మత్తులో కునుకు తీయగా లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో లారీలోని డీజల్, ఇంజన్ ఆయిల్ నేలపాలై రూ.30వేలు నష్టం వాటిల్లిందని డ్రైవర్ తెలిపాడు.