గద్వాల్: అలంపూర్: వర్షాల కోసం ఘనంగా వరుణ యాగ పాదయాత్ర
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరుణ యాగ పాదయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ శాంతినగర్ నుండి ఆర్డీఎస్ కాలువ వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.