రాజోలు: రాజోలు మండలం శివకోటిలో కలుషిత నీటి సరఫరా: ఇబ్బందుల్లో గ్రామస్థులు
రాజోలు మండలం శివకోటి గ్రామంలో కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా పైప్లైన్లు లీక్ అవ్వడమే కారణమని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే లీకేజీని అరికట్టి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.