నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, ఏ ఎస్ పేట, సంగం, చేజర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లే రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మరో పక్క ఇప్పటికే పొగాకు నాటిన రైతులు ఈ వర్షం తమకు మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని అంతర్గత రహదారులు బురదమైన మారడం, జాతీయ రహదారిపై వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.