పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ఏపీ లోకాయుక్త జస్టిస్ టీ. మల్లికార్జున రావు
ఏపీ లోకాయుక్త జస్టిస్ టీ. మల్లికార్జున రావు కుటుంబ సమేతంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పెంచల కిషోర్ స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.