పూతలపట్టు: యాదమరిలో మేకపోతు దొంగతనం: ఇద్దరు అరెస్టు, 14 రోజుల రిమాండ్
యాదమరి మండలం కట్టకిందవూరులో మేకపోతును దొంగిలించిన తమిళనాడుకు చెందిన ఎం.హరి, వి.శివలను పోలీసులు అరెస్టు చేశారు. తుమ్మిందపాళ్యం క్రాస్ వద్ద వాహన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి మేకపోతు, బైక్ స్వాధీనం చేసుకుని, 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.