కడప జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వీరపు నాయుని పల్లి పరిధిలోని ఉరుటూరు గ్రామంలో ఎస్ఐ మంజునాథ్,పోలీసు సిబ్బంది శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు గ్రామస్థులతో సమావేశం నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు. పిల్లలను బాగా చదివించుకోవాలని, ఉత్తమ మార్గంలో నడిపి, ఉన్నత స్థానాలకు చేరుకొనే విధంగా చూడాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.